Yuvagalam: రైతులకు నారా లోకేశ్ మరో కీలక హామీ.. బద్వేల్ వేదికగా ప్రకటన

by Disha Web Desk 16 |
Yuvagalam: రైతులకు నారా లోకేశ్ మరో కీలక హామీ.. బద్వేల్ వేదికగా ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కడప జిల్లా బద్వేలులో కొనసాగింది. ఇందులో భాగంగా నారా లోకేశ్ రైతులతో కలిసి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ రాయలసీమ రైతులకు నీరు ఇస్తే బంగారం పండిస్తారని చెప్పారు. సీఎం జగన్ పాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు పెరిగాయని మండిపడ్డారు. డ్రిప్ ఇరిగేషన్‌పై రాయితీ ఎత్తివేయడాన్ని నారా లోకేశ్ తప్పుబట్టారు. రాయితీ ఎత్తివేయడంతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో రూ.11, 700 కోట్లతో రాయలసీమలో ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాయలసీమలో వైసీపీ నుంచి 49 మంది ఎమ్మెల్యేలు గెలిచారని.. ఈ ప్రాంతాన్ని ఒక్కరూ కూడా పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీకి ఇచ్చిన సీట్లు తమకు ఇస్తే అభివృద్ధి అంటో ఏంటో చేసి చూపిస్తామన్నారు. టీడీపీ గెలిస్తే ప్రతి రైతుకు రూ.20 వేల ఆర్థిక సాయం చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. ఇసుక దోపిడీలో జే ట్యాక్స్ రోజుకు రూ. 3 కోట్లు వెళ్తోందని నారా లోకేశ్ ఆరోపించారు.

ఇవి కూడా చదవండి:

Chennai: మంత్రి రోజాకు వైద్య పరీక్షలు.. హెల్త్ బులెటిన్ ఎప్పుడంటున్న అనుచరులు


Next Story