Chennai: మంత్రి రోజాకు వైద్య పరీక్షలు.. హెల్త్ బులెటిన్ ఎప్పుడంటున్న అనుచరులు

by Disha Web Desk 16 |
Chennai: మంత్రి రోజాకు వైద్య పరీక్షలు.. హెల్త్ బులెటిన్ ఎప్పుడంటున్న అనుచరులు
X

దిశ, నగరి: వైసీపీ మంత్రి ఆర్కే రోజాకు చెన్నై ఆపోలో ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ జరుగుతోంది. ఆమెకు ఏమయింది అన్న అంశంపై ఆస్పత్రి వర్గాలు ఎలాంటి మెడికల్ బులెటిన్ విడుదల చేయలేదు. ఆమె ఇటీవలి కాలంలో చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. రెండేళ్లకిందట అపోలో ఆస్పత్రిలోనే రెండు ఆపరేషన్లు జరిగాయి. చాలా కాలం విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత యాక్టివ్ అయ్యారు. ఆమె ఏ కార్యక్రమంలో పాల్గొన్నా చురుకుగా ఉంటారు. డాన్సులు కూడా చేస్తారు. హఠాత్తుగా కాళ్లు వాచిపోవడంతో ఆమె ఆస్పత్రిలో చేరినట్లుగా చెబుతున్నారు. కాళ్ల వాపు అనేది సహజంగా కిడ్నీలు, లివర్లలో తీవ్రమైన సమస్యలు ఉంటే వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నాయి.

ప్రస్తుతానికి రోజాకు పూర్తి స్థాయి వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఆమెకు ఎలాంటి అనారోగ్యం అన్నది మాత్రం చెప్పలేదు. కానీ త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. నగరి నుంచి చెన్నై వెళ్లి ఆస్పత్రిలో ఎందుకు చేరాల్సి వచ్చిందని ఏపీలోని ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవచ్చు కదా అని చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇతర పార్టీల నేతల్ని రాజకీయంగా చూడకుండా వ్యక్తిగతంగా తూలనాడేందుకు ఏ మాత్రం సంకోచించని నేత కావడంతో సోషల్ మీడియాపై ఆమెపై వైసీపీ వాళ్లు మాత్రమే సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed