మరోసారి గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. రైతుల కోసం ఏం చేశాడంటే?

by Disha Web Desk 8 |
మరోసారి గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. రైతుల కోసం ఏం చేశాడంటే?
X

దిశ, సినిమా : హీరో, దర్శకుడు రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన నటనకు, డ్యాన్స్‌కు ఎవ్వరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. హర్రర్ మూవీస్‌కు ఈయన పెట్టింది పేరు. రాఘవలారెన్స్ హీరోగా ఏదైనా హర్రర్ మూవీ వస్తుదంటే చాలు ఫ్యాన్స్‌కు పండుగే ఇక. ఈ నటుడు ఇటీవల చంద్రముఖి 2 సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. కానీ ఈ మూవీ అంతగా హిట్ అందుకోలేదు.

ఇక సినిమాల్లో ఆయన చాలా మందికి సహాయం చేసే మంచి వ్యక్తిగా కనిపిస్తుంటాడు. కానీ రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా ఈయన సూపర్ హీరో.. చాలా మంది అనాథలకు, వికలాంగులకు, అభాగ్యులకు తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయం చేస్తుంటారు. అయితే తాజాగా లారెన్స్ చేసిన పనికి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోతున్నారు. రైతులకు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకొని, వారి హృదయాలను గెలుచుకున్నాడు. అసలు ఏం జరిగిందంటే?

రాఘవ లారెన్స్ ఓ పేద రైతు కుటుంబానికి ట్రాక్టర్ అందించారు. ఆయన మాట్లాడుతూ.. హాయ్ ఫ్రెండ్స్ నేను కష్టాల్లో ఉన్న పేద రైతులకు ట్రాక్టర్స్ అందిస్తాను అని చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేను విల్లుపురం జిల్లాకు చెందిన ఓ పేద రైతు‌కు ట్రాక్టర్ అందించి, ఆయన కళ్లలో ఆనందం చూశాను. అతను తన చెల్లి భర్త చనిపోవడంతో వారి ఫ్యామిలీని కూడా చూసుకుంటున్నాడు.. నేను ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలని, నా టీం సభ్యులతో వెళ్లి సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చాను వారు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. నాకు చాలా హాప్పి గా అనిపించింది. త్వరలోనే మరికొంత మందికి ట్రాక్టర్స్ అందిస్తాను అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. లారెన్స్ చేస్తున్న పనిని చూసి ఆయనను అందరూ ప్రశంసిస్తున్నారు.. నువ్వు గ్రేట్.. మనిషివి కాదు దేవుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed