బీఆర్ఎస్‌కు బిగ్ షాక్! ఉమ్మడి నల్గొండ జిల్లాలో "కారు" కనుమరుగు?

by Ramesh N |
బీఆర్ఎస్‌కు బిగ్ షాక్! ఉమ్మడి నల్గొండ జిల్లాలో కారు కనుమరుగు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలు పూర్తి అయిన కూడా బీఆర్ఎస్‌లో నేతల వలసలు ఆగేలా కనిపించడం లేదని టాక్ నడుస్తోంది. ఇప్పటికే సీనియర్ నేతలు కారు దిగిపోవడంతో షాక్‌లో ఉన్న బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలేలా ఉంది. కాంగ్రెస్‌లో చేరేందుకు బీఆర్ఎస్ నేతలు ఆసక్తిచూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఆ నేతలు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నట్లు టాక్ నడుస్తోంది.

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు!

అసెంబ్లీ ఎన్నికల్లో 12 నియోజకవర్గాల్లో 11 స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ భువనగిరి, నల్గొండ ఎంపీ సీట్లు కూడా భారీ మెజార్టీతో గెలుస్తామని పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ దాదాపు కనుమరుగు అయ్యే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్‌. ఎంపీ ఎన్నికల సమయంలో భువనగిరి మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే జిల్లా నుంచి ఓ మాజీ ఎమ్మెల్యే, నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, కో- ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు కాంగ్రెస్‌లో చేరేందుకు పార్టీ పెద్దలతో రహస్య చర్చలు జరుపుతున్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ హవా కంటిన్యూ..

ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ బడా నేత చేరికలపై తెర వెనుక చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి నల్గొండలో కాంగ్రెస్ హవా మరింత పెంచేందుకు బడా నేత ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్‌తో చర్చలు జరుపుతన్నట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. అలాగే కాంగ్రెస్ పాలన సజావుగా సాగేందుకు ఈ చేరికలు దోహదపడతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు జూన్ నుంచి జనవరి వరకు లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఆటలు సాగకుండా కాంగ్రెస్ బలాన్ని మరింత పెంచేందుకు అవకాశం ఉంటుందని చర్చనీయాంశంగా మారింది.

బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మినహా మిగితా నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరి.. పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ‘కారు’ కనుమరుగు అని కాంగ్రెస్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

Next Story

Most Viewed