Kadapa: సీఎం జగన్ మేనమామకే నిరసన సెగ

by Disha Web Desk 16 |
Kadapa: సీఎం జగన్ మేనమామకే నిరసన సెగ
X

దిశ, కడప: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం వైయస్సార్ జిల్లా వెల్లూరు మండలం దేవరాజు పల్లె గ్రామంలో వైసీపీ నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పాల్గొంటున్న విషయం తెలుసుకున్న దేవరాజుపల్లె గ్రామస్తులు కొందరు వారి ఇళ్లపై టీడీపీ జెండాలు కట్టి నిరసన వ్యక్తం చేశారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. దేవరాజుపల్లెలో ఓసీ, ఎస్సీ, బీసీ కాలానీల్లోనూ ఇలానే చుక్కెదురైంది.


కాగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి స్వగ్రామమైన మాచిడిపల్లెకు కూత వేటు దూరంలో ఈ కాలనీలు ఉన్నాయి. ఈ మూడు కాలనీలలో సూమారు 1600 ఓట్లు ఉన్నాయి. గ్రామంలో అత్యధికంగా టీడీపీ కార్యకర్తలు ఉన్నారు.


ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తూ టీడీపీ కార్యకర్తలు గ్రామం నుంచి వెళ్ళి పోయారు. అయినా గ్రామంలో ఉన్న కొద్దిపాటి గ్రామస్తుల ఇళ్ల వద్దకు వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. గ్రామంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Next Story

Most Viewed