Ap News: మార్చి 9 నుంచి తొలి దశ ఉద్యమం.. Cm Jagan ఇలాక నుంచే కీలక ప్రకటన

by Disha Web Desk 16 |
Ap News:  మార్చి 9 నుంచి తొలి దశ ఉద్యమం.. Cm Jagan ఇలాక నుంచే కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వానికి బాధ్యతలను గుర్తు చేసేందుకే ఉద్యోగ సంఘాలు ఉద్యమ బాటపడుతున్నాయని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. తమ ఉద్యమం ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం కాదని ఆయన వ్యాఖ్యానించారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసమే ఉద్యమం చేస్తున్నామే తప్ప వేరే ఉద్దేశం తమకు లేదన్నారు. అయితే కొందరు తమ వెనుక కొన్ని శక్తులు ఉండి నడిపిస్తున్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ ఉద్యమానికి ఎలాంటి అపవాదులు అంటించవద్దని విజ్ఞప్తి చేశారు.


మార్చి 9 నుంచి ఏప్రిల్ 3 వరకు తొలి దశ ఉద్యమం

వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటిస్తున్న బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. మార్చి 9 నుంచి ఏప్రిల్ 3 వరకు తొలి దశ ఉద్యమం ఉంటుందని.. ఏప్రిల్ 5న పరిస్థితిని సమీక్షించి రెండో దశ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని.. ఉద్యోగులు సంతోషంగా ఉన్నప్పుడే ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తారని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు.



Next Story