తెరపైకి కీలక డిమాండ్.. చంద్రబాబును టార్గెట్ చేసిన జగన్

by Vemula.Srinu Prasad |

ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరో సమాధానం చెప్పాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు...

తెరపైకి కీలక డిమాండ్.. చంద్రబాబును టార్గెట్ చేసిన జగన్
X

దిశ, వెబ్ డెస్క్: 2024 సాధారణ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది.. అలాగే వైసీపీ(Ycp) భారీ ఓటమిని మూట గట్టుకుంది. 11 సీట్లకే పరిమితమైంది. అయితే ప్రతిపక్ష హోదా(Opposition status) దక్కకపోవడంతో అసెంబ్లీకి వచ్చేందుకు జగన్(Jagan) ఇష్టపడటంలేదు. మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతిపక్ష హోదా డిమాండ్‌ను ఆయన మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. అంతేకాదు తాను సీఎంగా ఉన్న సమయంలో అసెంబ్లీ(Assembly)లో జరిగిన ఘటనను గుర్తు చేస్తే సీఎం చంద్రబాబుపై విమర్శలు కురిపించారు.

మంగళగారి తాడేపల్లి క్యాంపు(Tadepalli Camp) కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను సీఎంగా ఉండగానే అసెంబ్లీకి రావొద్దనే చంద్రబాబు పెద్ద డ్రామా క్రియేట్ చేశాడని చెప్పారు. తనను కించపరిచేలా వైసీపీ ఎమ్మెల్యేలు నాడు ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా..సభలో ఏడ్చి నానాయాగీ చేశారన్నారు. జగన్ ఉంటే తాను అసెంబ్లీకి రాను అని చెప్పి చంద్రబాబు వెళ్లిపోయారని తెలిపారు. అసెంబ్లీ రికార్డులు మొత్తం తిరగేశా వైసీపీ వాళ్లు ఎక్కడా తప్పు మాట్లాడలేదన్నారు. ఇకనైనా తమకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరో ముఖ్యమంత్రి చంద్రబాబు(Chief Minister Chandrababu) సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Next Story