- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆంధ్రప్రదేశ్ నుండి మరో ప్రత్యేక రాష్ట్రం..? YCP మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు
రాజధాని అంశంపై మంత్రి ధర్మాన ప్రసాద్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రాజధాని అంశంపై మంత్రి ధర్మాన ప్రసాద్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం చంద్రబాబు ఏపీ రాజధాని అమరావతే అని చెబుతున్నారని.. అదే జరిగితే విశాఖ రాజధానిగా ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. మా రాష్ట్రం మాకు ఇచ్చేస్తే.. మేం చిన్న రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటామంటూ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్ అనుభవం ఉండగా.. రాజధానిని మళ్లీ ఒకే ప్రాంతంలో నిర్మించే పని ఎవరైనా చేస్తారా అని ప్రశ్నించారు. రాజధాని పేరుతో వ్యాపారం చేసుకుంటాం, లే అవుట్లు వేసుకుంటామంటే ఊరుకునే పరిస్థితి లేదని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ను వ్యాపార కేంద్రంగా మాత్రమే చూస్తున్నారని ఫైర్ అయ్యారు. కాగా, ఏపీ రాజకీయాల్లో రాజధాని ఏర్పాటు అంశం తీవ్ర దుమారం రేపుతోన్న వేళ.. ఏకంగా వైసీపీ మంత్రి ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కొత్త డిమాండ్ తెరపైకి తీసుకురావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. .
Also Read..






