AP Politics: జనసేన అధినేత పవన్‌పై వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 18 |
AP Politics: జనసేన అధినేత పవన్‌పై వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో అన్ని పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌కు డబ్బు ఎక్కడ నుంచి వస్తుందని వైసీపీ నేత పోతిన మహేశ్ ప్రశ్నించారు. 2014 నుంచి 2024 వరకు పవన్ ఎన్ని సినిమాలు చేశారు? అందులో ఎన్ని మూవీలు హిట్ సాధించాయి. ఎన్ని డిజాస్టర్లు అయ్యాయని పోతిన మహేశ్ ప్రశ్నించారు. కనీసం ఆరు సినిమాలు కూడా ఆయన చేయలేదు. ఈ చిత్రాలకు ఆయన ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు? ఎంత ట్యాక్స్ కట్టారు? పార్టీ కోసం పవన్ ఖర్చు పెట్టింది ఎంత? కొన్న ఆస్తులు ఎంత? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అంతే కాదు త్వరలో పవన్ ఆస్తుల వివరాలు బయటపెడతా అని స్పష్టం చేశారు.


Next Story

Most Viewed