వైఎస్‌ను ద్రోహిగా చిత్రీకరించిన పార్టీలో చేరుతావా : షర్మిలపై ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 1 |
వైఎస్‌ను ద్రోహిగా చిత్రీకరించిన పార్టీలో చేరుతావా : షర్మిలపై ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ షర్మిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ.. తెలంగాణలో పార్టీ పెట్టి చివరికి ఏమీ చేయలేక పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిందని అరోపించారు. ఏం సాధించాలని షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిందంటూ మండిపడ్డారు.

వైస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ ఘోషిస్తుంది

దివంగత నేత వైస్ రాజశేఖర్ రెడ్డిని ఎఫ్ఐఆర్‌లో ద్రోహిగా చిత్రీకరించిన పార్టీలో చేరి షర్మిల క్షమించరాని తప్పు చేసిందని కృష్ణదాస్ కాస్త ఎమోషనల్ అయ్యారు. ఏపీకి వచ్చి ఏం సాధించాలని పీసీసీ పగ్గాలు చేపట్టావంటూ ప్రశ్నించారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వల్ల పైనున్న వైస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ ఘోషిస్తుందని పేర్కొన్నారు. స్వయాన అన్న జగన్ ఓదార్పు యాత్ర చేస్తానంటే అనుమతివ్వని కాంగ్రెస్ పార్టీలో ఎలా చేరాలని అనిపించిందంటూ ప్రశ్నించారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల తమ పార్టీకి కలిగే నష్టం ఏమీ లేదని ధర్మాన కృష్ణదాస్ అన్నారు.

Next Story

Most Viewed