గంటా శ్రీనివాస్‌ దారెటు? హైకమాండ్ ఆదేశాలు వినకపోతే?

by Disha Web Desk 14 |
గంటా శ్రీనివాస్‌ దారెటు? హైకమాండ్ ఆదేశాలు వినకపోతే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల తరుణంలో ఏపీ రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి సెగ్మెంట్ హాట్‌టాపిక్‌గా మారింది. టీడీపీ అధిష్టానం చీపురుపల్లి నియోజకవర్గం అభ్యర్థిగా బరిలో ఉండాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌ను కోరింది. వైసీపీ అభ్యర్థి, మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేసేందుకు సరైన వ్యక్తి గంటానేని పార్టీ భావించింది. అయితే గంటాకు మాత్రం చీపురుపల్లి‌ నుంచి బరిలో దిగాలని ఆసక్తి లేదు. ఈ విషయాన్ని కూడా పార్టీ అధిష్టానానికి తెలియజేశారు. దీంతో పార్టీ అధిష్టానం ఆయనకు నచ్చజెప్పింది. ఆయన మాత్రం పట్టువదలకుండా ఆ స్థానంలో మాత్రం పోటీ చేయనని తేల్చిచెప్పినట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది.

అధిష్టానం ఆదేశాలు వింటారా? వినరా?

టీడీపీ అధినేత చంద్రబాబును మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు నిన్న ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. గంటాను చీపురుపల్లి నుంచి పోటీ చేయించే ఉద్దేశంతో ఉన్న చంద్రబాబు అదే విషయాన్ని మరోసారి ఆయనకు చెప్పినట్లు తెలిసింది. దీనిపై గంటా తన నిర్ణయం వెల్లడించలేదని సమాచారం. అయితే విశాఖ జిల్లాలో గంటాకు పోటీ చేయాలని ఆసక్తి ఉన్నట్లు తెలిసింది. మరి అధిష్టానం ఆదేశాలు వింటారా? వినరా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

నేడో, రేపో రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం!

చీపురుపల్లిలో అవకాశాలపై తన సహచరులు, స్నేహితులు, పార్టీ కార్యకర్తలతో రాజకీయ భవిష్యత్ పై చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే విశాఖపట్నంలోని గంటా శ్రీనివాసరావు నివాసంలో ఇవాళ కీలక సమావేశం ప్రారంభమైంది. చర్చల తర్వాత ఆయన నేడో, రేపో కీలక ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది.

Read More..

జగన్ తోక కత్తిరించబోతున్నాం: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్



Next Story

Most Viewed