జగన్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి! ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరో తెలుసా?

by Disha Web Desk 14 |
జగన్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి! ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరో తెలుసా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే ఏపీ సీఎం జగన్‌కు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చెక్ పెట్టేలా ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న విషయం తెలిసిందే. మార్చి 11న విశాఖలో జరిగే స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో రేవంత్ పాల్గొంటారని గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి.. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలకు మద్దతుగా కీలక ప్రసంగం ఇవ్వనున్నారు. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలను ప్రకటిస్తారని, అందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్పకుండా ఉంటుందని సమాచారం. అయితే సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ తొలిసారి ఆంధ్రాకు విచ్చేయనున్నారు. దీంతో ఆంధ్ర రాజకీయాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాట్ టాపిక్‌గా మారారు.

సీఎంగా పనితీరులో రేవంత్ రెడ్డి బెటర్?

తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన‌పై సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం జగన్ పాలనపై పోల్ సర్వే చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సర్వేలో సీఎం రేవంత్ రెడ్డి పనితీరుకు 74 శాతం ఓట్లు రాగా.. సీఎం జగన్‌కు 26 శాతం ఓట్లు వచ్చినట్లు నెట్టింట పోస్ట్ చేశారు. దీంతో వైసీపీ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆ పోస్ట్‌పై విరుచుకపడుతున్నారు. అది టీడీపీ పార్టీ చేసిన ఒక ఫేక్ సర్వే అని వైసీపీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు టీడీపీ అభిమానులు స్వయం కృషితో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, జగన్ మాత్రం అబద్దం చెప్పి ముఖ్యమంత్రి అయ్యారని తీవ్ర స్థాయిలో ఏపీ సీఎంను విమర్శించారు. దీంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు.

Next Story

Most Viewed