మే 10 తర్వాత రాష్ట్రంలో పెను మార్పులు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

by Disha Web Desk 12 |
Kishan Reddy Urges CM KCR to allot land for Ramagundam ESI Hospital
X

దిశ, వెబ్‌డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికలకు సరిగ్గా 12 రోజులు వ్యవధి మాత్రమే ఉంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి రోజురోజుకు పెరిగిపోతోంది. ఇందులో భాగంగా ప్రధాన పార్టీలు ఒకరిపై మరొకరు తీవ్రమైన విమర్శలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. మరోసారి భారీ మెజారిటీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనిపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఓ మీడియాతో మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో ప్రధాని మోడీ హవా కొనసాగుతుందని.. తాము చేసిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయన్నారు. ఈ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని.. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమపై విమర్శలు చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. అలాగే నేటి నుంచి రాష్ట్రంతో ప్రధాని మోడీ వరుస సభలో పాల్గొంటారు.. కాసేపట్లో ఆయన తెలంగాణలో అడుగుపెట్టనున్నారు. అలాగే ఈ నెల 10 ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోడీతో భారీ బహిరంగ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభ తర్వాత రాష్ట్రంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయని కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి మీడియాతో తెలిపారు.

Next Story