వారికి సంక్షేమ పథకాలు ఆపివేస్తాం : హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-14 09:06:45  IST  )

రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి అనిత తెలిపారు.

వారికి సంక్షేమ పథకాలు ఆపివేస్తాం : హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. గంజాయిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఈగల్ టీమ్ (Eagle Team) కలిసి పనిచేసి సమూల మార్పును తీసుకొచ్చాయని తెలిపారు. అలాగే అరకు అంటే కాఫీ గుర్తొచ్చేలా మార్చేశామని పేర్కొన్నారు. గంజాయి మూలాలను నిర్మూలించి, గంజాయి కింగ్ పిన్ లను అరెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకూ రూ.7 కోట్ల విలువైన ఆస్తుల్ని సీజ్ చేశామన్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల కదలికలపై దృష్టి సారించాలని, వాళ్లు ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? అని నిఘా పెట్టాలని హోంమంత్రి అనిత సూచించారు. గంజాయిని పండించే, విక్రయించే, వినియోగించే వారికి సంక్షేమ పథకాలను ఆపివేయాలన్న ప్రతిపాదన ఉందని, దీనిపై పునరాలోచన చేస్తామని చెప్పారు.

ఇక సీఎం చంద్రబాబు నాయుడిపై (CM Chandrababu Naidu) వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) చేసిన వ్యాఖ్యలపై మంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు గురించి మాట్లాడేవారు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. చంద్రబాబుని విమర్శించే స్థాయి ఎవరికీ లేదని, 10 సంతకాలు చేసి 11వ సంతకానికి వణికిపోయేవారికి ఆయన వయసు గురించి మాట్లాడే అర్హత ఉండదన్నారు.

Next Story