ఏపీలో ఎన్నికలు జరిగేనా.. వాయిదా పడేనా.. !?

by Disha Web Desk 18 |
ఏపీలో ఎన్నికలు జరిగేనా.. వాయిదా పడేనా.. !?
X

దిశ ప్రతినిధి,విజయవాడ:ఎన్నికల ప్రక్రియను సంక్లిష్టంగా మార్చేందుకు ఉద్యోగుల వ్యూహం ఒక్కొక నియోజకవర్గంలో 175 నామినేషన్లు దాఖలు చేయనున్న ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఉన్నారు. సీపీఎస్ రద్దు, సీపీఎస్ నిధుల అక్రమ మళ్లీంపు, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై ఏపీ ప్రభుత్వ వైఖరిని దేశవ్యాప్తంగా ఎండగట్టే ప్రణాళిక ఉద్యోగులను చులకనగా హీనంగా చూస్తున్న వైసీపీ, టీడీపీలకు గుణపాఠం. మీకు మా రెండు పార్టీలు తప్పితే ప్రత్యాన్మాయం లేదు కదా అని వెటకరిస్తున్న అధికార, ప్రతిపక్షాలకు షాక్ ఇవ్వనున్న ఉద్యోగులు. గెలుపు ముఖ్యం కాదు కానీ మా ఓటు మాకే వేసుకుంటాం ఇదీ మా ఆత్మగౌరవ సమస్య అంటున్న ఉద్యోగులు. ఈ భారీ నామినేషన్ల వ్యూహం అమలులో తెరవెనుక చక్రం తిప్పుతున్న ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు ఈ భారీ నామినేషన్ల ప్రభావం ఏ పార్టీ మీద పడేనో. ఇదే జరిగితే రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడం ఎలా అంటూ ఎన్నికల సంఘం టెన్షన్.

సుమారు 12 లక్షల ఈవీఎంలు కావాలి.లేదా బ్యాలెట్ పేపర్ పెట్టాలి. పోలింగ్ బూత్ లు మార్చాలి.పెద్ద సంఖ్యలో మానవ వనరులు, రవాణా సమకూర్చాలి.రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ స్థాయిలో నామినేషన్లు దాఖలైతే ప్రపంచ రికార్దే. మా జీతాలు నుంచి మేం పొదుపు చేసుకున్న నిధులను మాకు తెలియకుండానే వాడుకుంటున్నారు. ఇదేం న్యాయం అని ప్రశ్నిస్తే కక్ష్య సాధింపులకు పాల్పడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వారంలోగా సీపీఎస్ రద్దు చేస్తామన్నారు. సీపీఎస్ రద్దు చేయకపోగా. మా జీతాల నుంచి కంట్రిబ్యూషన్ పెన్షన్ కోసం ప్రతి నెల చెల్లిస్తున్న 10 శాతం నిధులను గత 12 నెలలుగా అక్రమంగా మళ్లించేశారు. అదేటంని ప్రశ్నిస్తే ప్రభుత్వ పెద్దల నుంచి చీదరింపులు, వెటకారాలు.మేం దాచుకున్న 26 వేల కోట్ల రూపాయల సొమ్ము మా అనుమతి లేకుండానే, మాకు తెలియకుండానే వాడేశారు. దయచేసి మేం దాచుకున్న సొమ్ము మా అవసరాలకు మాకు ఇప్పించండి. అని ప్రాధేయపడుతుంటే ఛీత్కారాలు, ఈసడింపులు చేస్తున్నారు.



Next Story