కాంగ్రెస్ బహిరంగ సభను జయప్రదం చేయండి: గిడుగు రుద్రరాజు

by Disha Web Desk 18 |
కాంగ్రెస్ బహిరంగ సభను జయప్రదం చేయండి: గిడుగు రుద్రరాజు
X

దిశ,ప్రతినిధి:విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే "స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్"బహిరంగ సభను జయప్రదం చేయండి అని సిడబ్ల్యుసి మెంబర్ గిడుగు రుద్రరాజు,విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నేడు ఉక్కు నగరంలోని స్థానిక ఏఐటియుసి కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ ఈ పరిశ్రమ స్థాపనకు భూములు ఇచ్చిన నిర్వాసితుల భూముల విలువను పెంచింది కాంగ్రెస్ పార్టీ అని వివరించారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలు ద్వారా స్థానిక ప్రజలతో పాటు అనేకమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ప్రధాన లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ దీనిని స్థాపించిందని ఆయన అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడం మనందరి లక్ష్యంగా మారాలని ఆయన కోరారు. అందుకే ఈ అంశాన్ని తమ మేనిఫెస్టోలో పెట్టి దీనిపై ఉద్యమం చేస్తున్న వారికి సహకరిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఈ బహిరంగ సభలో ఈ అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారిచే ప్రవేశపెట్టి మా చిత్తశుద్ధిని తెలియజేస్తామని ఆయన అన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించాల్సిన అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ప్రజలకు నష్టం చేకూరుస్తుంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంది.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పి. రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఈ బహిరంగ సభను ఉక్కునగరంలోని "త్రిష్ణ గ్రౌండ్" లో ఈ నెల 15వ తారీకు సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. దీనిలో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు శ్రీ వైయస్ షర్మిలా రెడ్డి గారు, మేనిఫెస్టో కమిటీ సభ్యులు శ్రీ పలం రాజుగారు, రఘువీరా రెడ్డి గారు, జెడి శీలం వంటి జాతీయ నాయకులు విచ్చేసి ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన వైఖరిని తెలియజేస్తారని ఆయన అన్నారు.

దీనిలో ఇండియా కూటమి సభ్యులైన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకులు పాల్గొని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టే డిక్లరేషన్ కు మద్దతుగా ప్రసంగిస్తారని ఆయన వివరించారు. కనుక రాష్ట్రంలో మిగిలిన రాజకీయ పక్షాలు ఈ సమస్య పరిష్కారం కొరకు తమ స్పష్టమైన వైఖరిని ప్రదర్శించి స్టీల్ ప్లాంట్ రక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. సినీ డైరెక్టర్ పి సత్యారెడ్డి మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమ నేపథ్యంలో తెరకు ఎక్కిన "ఉక్కు సత్యాగ్రహం"ట్రైలర్ ను తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదగా జరుగుతుందని ఆయన అన్నారు. ఈ చిత్రం ద్వారా ఉద్యమం మరింత ఉధృతం అవ్వాలని ఆయన ఆకాంక్షించారు.

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు డి ఆదినారాయణ, నీరుకొండ రామచంద్రరావు, జె అయోధ్య రామ్, గణపతి రెడ్డి మాట్లాడుతూ 1126 రోజులుగా దీని రక్షణకై ఉద్యమం చేస్తున్నామని , ప్రజా ఉద్యమాలకు రాజకీయ ఉద్యమాలు తోడైతేనే ప్రజల విజయం సాధిస్తారన్న నమ్మకంతోనే ఈ బహిరంగ సభను సంయుక్తంగా నిర్వహిస్తున్నామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రసాద్ రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి జెర్రిపోతుల ముత్యాలు, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు కె ఎస్ ఎన్, దొమ్మేటి అప్పారావు, వరసాల శ్రీనివాస్, డి సురేష్ బాబు, విళ్ళ రామ్మోహన్ కుమార్, దాలి నాయుడు, మహాలక్ష్మి నాయుడు, డేవిడ్, కరణం సత్యారావు, డివి రమణారెడ్డి, వి ప్రసాద్, పరంధామయ్య తదితరులతో పాటు కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed