Visakha Steel Plant: మాట మార్చిన కేంద్రమంత్రి .. కంగుతిన్న యూనియన్ నాయకులు

by Disha Web Desk 16 |
Visakha Steel Plant: మాట మార్చిన కేంద్రమంత్రి .. కంగుతిన్న యూనియన్ నాయకులు
X

దిశ, ఉత్తరాంధ్ర: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వెనక్కు తీసుకునే అంశం కేంద్ర కేబినెట్ పరిధిలో ఉంటుందని ఉక్కు శాఖా సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ స్పష్టం చేశారు. విశాఖ నోవాటెల్ హోటల్‌లో ఉక్కు యూనియన్ నాయకులు స్థానిక ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో పాటు మంత్రి ఫగ్గన్‌ను కలసుకున్నారు. ఉక్కు ప్రైవేటీకరణ లేనట్టేనని మంత్రి ఫగ్గన్ చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మంత్రిని ఉక్కు ఉద్యోగులు కలిశారు.

అయితే మంత్రి మాట్లాడుతూ ఇది తాను తీసుకోవాల్సిన నిర్ణయం కాదని, పాలసీ మేటర్ గనుక కేబినెట్‌కి మాత్రమే అధికారం ఉందని తేల్చి చెప్పేచేశారు. దీంతో యూనియన్ నాయకులు కంగు తిన్నారు. మంత్రి ఉదయం మాట్లాడిన మాటల్లో 'ఉక్కు ప్రైవేటీకరణ తమ తక్షణ ప్రాముఖ్యత కాదని' స్పష్టంగా చెప్పారు. దీంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందని ప్రచారం జరిగింది. ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని కేంద్రం నిజంగా వెనక్కు తీసుకుంటే ప్రధాని మోడీనో, హోమ్ మంత్రి అమిత్ షానో ప్రకటిస్తారు గాని ఇలా సహాయ మంత్రి ద్వారా ఎలా ఈ ప్రకటన వస్తుందని సీనియర్ నాయకులు అంటున్నారు. ఏది ఏమైనా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కేంద్రమంత్రి స్పష్టం చేయడంతో ఆందోళనలు కొనసాగేలా కనిపిస్తున్నాయి.

Next Story