కనకమహాలక్ష్మీ దేవాలయంలో చంటి బిడ్డలకు ప్రత్యేక ఏర్పాట్లు

by Disha Web Desk 16 |
కనకమహాలక్ష్మీ దేవాలయంలో చంటి బిడ్డలకు ప్రత్యేక ఏర్పాట్లు
X

దిశ, ఉత్తరాంధ్ర: మార్గశిర మాసోత్సవాలు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిమంది భక్తులు హాజరవడం ఆనవాయితీ. వీరిలో చంటి బిడ్డల తల్లులు ఉంటారు. కనకమహాలక్ష్మీ అమ్మవారి దర్శనం క్యూలైన్లలో చిన్నారులకు పాలిచ్చేందుకు ప్రత్యేక షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. పిల్లలకు పాలు, ఆహార పదార్థాలు అందించడంతో పాటు తాత్కాలిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుతో పాటు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం సూచనల మేరకు ఈ ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సూచనలు అమలు చేయడంలో పూర్తిగా సహకరించిన విశాఖ జిల్లా కలెక్టర్‌కు, దేవస్థానం కార్య నిర్వహణ అధికారికి, పాలక మండలి చైర్ పర్సన్‌కు పాలక మండలి సభ్యులకు సీతారాం అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి సభ్యులు ఎన్.సుబ్రమణ్యం, చైల్డ్ డెవలప్మెంట్ ప్రోజెక్ట్ ఆఫీసర్ రమణి కుమారి, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ప్రతినిధులు సత్యవతి, భవాని, సీఆర్పీఎఫ్ రాష్ట్ర కో.కన్వీనర్ పి.శేఖర్, నగర కన్వీనర్ కె.ఎల్లయ్య, దేవాదాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed