వైజాగ్ బీచ్ కు కొట్టుకొచ్చిన భారీ పాము..

by Disha Web Desk 18 |
వైజాగ్ బీచ్ కు కొట్టుకొచ్చిన భారీ పాము..
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం : వైజాగ్ తీరానికి మంగళవారం ఓ భారీ పాము కొట్టుకువచ్చింది. అక్కడే ఉన్న మత్స్యకారులు దానిని గమనించి వెంటనే తమ వలతో పామును పట్టుకున్నారు. మత్స్యకారుల వలకు చిక్కిన పామును చూసిన అక్కడి జనాలు భయాందోళనకు గురైనారు. దీన్ని తిరిగి సముద్రంలో విడిచిపెట్టే క్రమంలో ఇది చనిపోయిందని చెప్పారు. ఈ పాము గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. సముద్రంలో అరుదుగా కనిపించే ఈ పామును నలపాముగా వ్యవహరిస్తారని మత్స్యశాఖ అధికారులు తెలిపారు.వలలో చిక్కుకోవడంతో భయాందోళనకు గురై ఈ పాములు చనిపోతాయని వివరించారు.నగర పరిధిలోని సాగర్ నగర్ బీచ్ దగ్గర్లో ఈ కళేబరం కనిపించింది. ఈ భారీ పాము కళేబరాన్ని చూసేందుకు చుట్టుపక్కల వారు గుడ్లవాని పాలెం అమ్మవారి ఆలయ తీరానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.

Next Story

Most Viewed