ఇలాంటి నగరం మరోటి లేదు: విశాఖపై ప్రశసంలు కురిపించిన చంద్రబాబు

by Vemula.Srinu Prasad |

విశాఖపై చంద్రబాబు ప్రశసంలు కురిపించారు...

ఇలాంటి నగరం మరోటి లేదు: విశాఖపై ప్రశసంలు కురిపించిన చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో నైపుణ్యానికి ఏమాత్రం కొరతలేదని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అన్నారు. విశాఖలో కాగ్నిజెంట్ కార్యాలయానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కాగ్నిజెంట్(Cognizant) ఏర్పాటుతో 25 వేల మందికి ఉపాధి కల్పన దొరకుతుందని తెలిపారు. నాలెడ్జ్ ఎకనామీ, టెన్నాలజీ హబ్‌గా విశాఖ మారబోతోందని తెలిపారు. గతంలో దేశమంటే చిన్న చూపు ఉండేదని గుర్తు చేశారు. ఐటీ ఫస్ట్ అడ్వాంటేజ్ తీసుకున్నామని తెలిపారు. కాగ్నిజెంట్‌ విశాఖ అతిపెద్ద కేంద్రం కావాలని చంద్రబాబు ఆకాక్షించారు.

తాను ఏది చేసినా మెగా స్కేల్‌లో ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖ(Visakha) లాంటి అందమైన నగరం మరోటి లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాగ్నిజెంట్ ప్రధాన కార్యాలయాన్ని విశాఖకు మార్చాలని కంపెనీ సీఈవోను కోరానని వెల్లడించారు. త్వరలోనే అది సాధ్యమవుందనే నమ్మకం ఉందని తెలిపారు. వరల్డ్‌లో నడుస్తున్న టాప్ 10 కంపెనీలను భారతీయులే నడిపిస్తున్నారని చెప్పారు. రియల్ టైమ్‌లోనే కంపెనీలకు క్లియర్ ఇస్తామని చంద్రబాబు తెలిపారు.

Next Story