AP SET 2024- దరఖాస్తు గడువు పెంపు..ఎప్పటివరకంటే?

by Disha Web Desk 18 |
AP SET 2024- దరఖాస్తు గడువు పెంపు..ఎప్పటివరకంటే?
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ఏపీ ఉన్నత విద్యా సంస్థలలో లెక్చరర్లు అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల కోసం AP SET 2024 నోటిఫికేషన్‌ను ప్రచురించిన విషయం తెలిసిందే. అయితే అప్లికేషన్ గడువు నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా ఈ రోజు ముగియనుంది. కానీ ఈ గడవును ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష(ఏపి సెట్‌ 2024) దరఖాస్తు గడువును ఈ మార్చి 14వ తేదీ వరకు పొడిగించినట్లు ఏపిసెట్‌ మెంబర్‌ సెక్రటరీ ఆచార్య జి.ఎం.జె రాజు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిశీలించి దరఖాస్తు గడువును ఈ నెల 14వ తేదీ వరకు పొడిగించామన్నారు. విద్యార్థులు ఎటువంటి అపరాధ రుసుము చెల్లించకుండా ఈ నెల 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రూ. 2 వేల అపరాధ రుసుముతో మార్చి 25 వరకు,రూ 5 వేల అపరాధ రుసుముతో ఏప్రిల్‌ 5వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. ఏపిసెట్‌ ప్రవేశ పరీక్షను 30 సబ్జెక్టులలో ఏప్రిల్‌ 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 8 రీజినల్‌ కేంద్రాల పరిధిలో నిర్వహస్తామని తెలిపారు.

Read More..

రేషన్ డిపోలు ఎం.డి.యు వాహనాలపై విస్తృత దాడులు


Next Story

Most Viewed