Cm Jagan అహంవీడి నేలకు దిగాడు: Varla Ramaiah

by Disha Web Desk 16 |
Cm Jagan అహంవీడి నేలకు దిగాడు: Varla Ramaiah
X
  • చంద్రబాబు వస్తున్న ప్రజాదరణ వైసీపీలో మొదలైన భయం
  • జగన్‌కు మాకు సంబంధం లేదన్న విజయమ్మ వ్యాఖ్యలు మోసపూరితం
  • - టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలకు పోటెత్తుతున్న జనసంద్రాలను చూసి సీఎం వైఎస్ జగన్‌కు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. వివేకా హత్యకేసు విచారణ పొరుగు రాష్ట్రానికి బదిలీ అయినప్పుడే జగన్ ప్రభుత్వం మానసికంగా చచ్చిపోయిందని విమర్శించారు. చంద్రబాబు పర్యటనలకు వస్తున్న ప్రజాస్పందన చూశాక.. గాల్లో తిరిగే ముఖ్యమంత్రి అహంవీడి నేలకు దిగాదని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు.

మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో శనివారం వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. మూడు నెలల క్రితం తన వెంట్రుక కూడా పీకలేరని గంభీరంగా మాట్లాడిన సీఎం ఇప్పుడు చంద్రబాబు సభలకు వస్తున్న ప్రజాస్పందన చూసి ప్రజల్లోకి వస్తున్నారని ఎద్దేవా చేశారు. మేఘాల్లో తిరిగే ముఖ్యమంత్రి అహంవీడి నేలకు దిగాడని వర్ల రామయ్య విమర్శించారు.

మీ కుటుంబం నమ్మదగినది కాదు

సొంత బాబాయ్ వైఎస్ వివేకా హత్యకేసు పొరుగు రాష్ట్రానికి బదిలీ అయినప్పుడే వైసీపీ ప్రభుత్వం మానసికంగా చచ్చిపోయిందని వర్ల రామయ్య ఆక్షేపించారు. బాబాయ్‌ని చంపిన వారిని శిక్షించి, తన కుటుంబానికే న్యాయం చేసుకోలేనివాడు, తమకేం న్యాయం చేస్తాడని రాష్ట్ర ప్రజలంతా ముక్కున వేలేసుకుంటున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రికి నైతికత ఉంటే బాబాయ్ హత్య కేసు విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ అయినప్పుడు రాజీనామా చేసి ఉండేవాడన్నారు. జయహో బీసీ అనేది టీడీపీ కాన్సెప్ట్. ఆ మాట జగన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం అంటుంటే బీసీలు ఒప్పుకోవడం లేదన్నారు. వైసీపీ భావదారిద్ర్యంతో 'జయహో బీసీ' కాన్సెప్ట్ కాపీ కొట్టే దుస్థితికి దిగజారారని విమర్శించారు. మరోవైపు వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ తనకు ఏంసంబంధం అనడం రాష్ట్రప్రజల్ని మోసగించడం కాదా? అని ప్రశ్నించారు. 'కమీషన్ల కోసం జాకీ పరిశ్రమను తరిమేసిన ఎమ్మెల్యే తోపుదుర్తిని కట్టడిచేయలేని మీరు, మీ పార్టీ అధ్యక్షుడిగా బలహీనమైన వ్యక్తి కారా?. మీ ఎమ్మెల్యేను ఎందుకు జాకీ పరిశ్రమ వెళ్లిపోయిందని ప్రశ్నించగలిగే దమ్ముందా?.' అని నిలదీశారు. కొత్తకంపెనీలు తీసుకురాకపోగా ఉన్నవాటిని తరిమేస్తారా? అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు.

Read more:

2024 Elections చంద్రబాబు ప్లాన్ ఇదే..!



Next Story

Most Viewed