డీఎస్సీ రాని అభ్యర్థులు డోంట్ వర్రీ.. అలా చేస్తే మళ్లీ తలుపు తడతాయ్..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-15 15:27:00  IST  )

డీఎస్సీ జాబితాలో పేరు లేని అభ్యర్థులకే కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక సూచనలు చేశారు..

డీఎస్సీ రాని అభ్యర్థులు డోంట్ వర్రీ.. అలా చేస్తే మళ్లీ తలుపు తడతాయ్..!
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో డీఎస్సీ(DSC) తుది జాబితా విడులైన విషయం తెలిసిందే. అయితే ఈ జాబితాలో పేరు లేని అభ్యర్థులు తీవ్ర నిరాశ చెందారు. దీంతో వారికి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు(Union Minister Rammohan Naidu) ధైర్యం చెప్పారు. వర్చువల్‌గా అభ్యర్థులకు కీలక సూచనలు చేశారు. ఇకపై ఏటా డీఎస్సీ ఉంటుందనే హామీని ప్రభుత్వం ఇచ్చిందని, వేలాది మంది అభ్యర్థులకు కొత్త ఆశలు నింపిందని తెలిపారు. ఈ సారి అవకాశం రాని అభ్యర్థులు మరింత కృషితో మున్ముందు నిర్వహించబోయే డీఎస్సీలో చోటు దక్కించకోవాలని సూచించారు. తమకు సమయం వస్తుందని, మళ్లీ తలుపులు తడతాయ్ అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు భరోసా ఇచ్చారు. అలాగే డీఎస్సీలో చోటు దక్కించుకున్న అభ్యర్థులకు సైతం మంచి మేసేజ్ ఇచ్చారు. ఉపాధ్యాయులుగా కొత్త ప్రయాణాన్ని ఆరంభించి భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే శక్తి ఇప్పుడు మీ చేతుల్లోనే ఉందన్నారు. ఇది కేవలం ఎంపిక మాత్రమే కాదని, ఏపీ విద్యా భవిష్యత్తుకు ఒక కొత్త అధ్యాయమని రామ్మోహన్ నాయుడు తెలిపారు.

Next Story