Viveka Case: అనూహ్య పరిణామం.. వైఎస్ సునీత భర్తను విచారించిన సీబీఐ

by Disha Web Desk 16 |
Viveka Case: అనూహ్య పరిణామం.. వైఎస్ సునీత భర్తను విచారించిన సీబీఐ
X

దిశ, వెబ్ డెస్క్: వివేకా హత్య కేసు విచారణలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు ఇప్పటికి వరకు విచారిస్తూ వచ్చారు. కానీ తాజాగా కొత్త ముఖం విచారణకు రావడం ఉత్కంఠ రేపింది. ఎంపీ అవినాశ్ రెడ్డి చెప్పడంతో వివేకా రెండో భార్య షేక్ షమీమ్ అంశం తెరపైకి వచ్చిందనుకుంటే.. ఇప్పుడు ఆమె ఇచ్చిన స్టేట్ మెంట్‌తో వైఎస్ సునీత భర్త పేరు కొత్తగా వెలుగులోకి వచ్చింది.

దీంతో వైఎస్ సునీత భర్త రాజశేఖర్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారణకు పిలిచారు. ఈ మేరకు ఆయనకు నోటీసులు ఇచ్చారు. దీంతో రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో విచారణను ఎదుర్కొన్నారు. దాదాపు 2 గంటల పాటు ఆయనను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వైఎస్ వివేకానందారెడ్డి రెండో వివాహం, ఆస్తి పంచాయితీపై అడిగి తెలుసుకున్నారు. అయితే రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన స్టేట్ మెంట్‌ను సీబీఐ అధికారులు రికార్డు చేశారు. అనంతరం రాజశేఖర్ రెడ్డి సీబీఐ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు.



Next Story

Most Viewed