- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tirumala: తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం షురూ.. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
వైకుంఠ ఏకాదశి (Vaikunta Ekadasi) పర్వదినం సందర్భంగా తిరుమల (Tirumala) క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది.

దిశ, వెబ్‌డెస్క్: వైకుంఠ ఏకాదశి (Vaikunta Ekadasi) పర్వదినం సందర్భంగా తిరుమల (Tirumala) క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున శ్రీవారి దర్శనానికి తరలివచ్చారు. అభిషేక సేవ (Abhisheka Seva) అనంతరం తెల్లవారుజామున 3 గంటల నుంచే అధికారులు భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ శ్రీనివాసుడిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
వారిలో కేంద్ర మంత్రి కిజరాపు రామ్మోహన్ నాయుడు (Union Minister Kinjarapu Rammohan Naidu), ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు (Ayyanna Pathrudi), డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు (Raghurama Krishna Raju), తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka), ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి శ్రీధర్‌బాబు, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఏపీ మంత్రులు వంగలపూడి అనిత (Vangalapudi Anitha), పార్థసారథి (Parthasarathi), సవిత (Savitha), నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) తిరుమలకు వచ్చారు. అదేవిధంగా అధ్యాత్మిక గురువు బాబా రాందేవ్, నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర తదితరులు ఉత్తర ద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకున్నారు. ఇటీవల జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో మళ్లీ ఎలాంటి అవాంఛనీయ ఘటనను చోటుచేసుకోకుండా భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
(Post and Photo's Credit's to SVBC TTD Official Facebook page)






