- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆలయానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మహిళలు మృతి
రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోటిపి చౌడేశ్వరి ఆలయానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. ఏపీ(Andhra Pradesh)లోని శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం ధనపురం క్రాస్ వద్ద హైవే పై గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు.
మరో ఆరుగురికి గాయాలయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో క్షతగాత్రులను వెంటనే హిందూపురం ఆసుపత్రికి తరలించారు. అనంతరం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అయితే మృతి చెందిన మహిళలు అలివేలమ్మ(45), ఆదిలక్ష్మమ్మ(65), శాకమ్మ(60)గా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో ఆటోలో 14 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితులను రొద్దం మండలం దొడగట్ట వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






