- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంక్రాంతి వేళ చేనేతలకు శుభవార్త.. రూ.5 కోట్లు చెల్లింపునకు రంగం సిద్ధం
చేనేతలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది..

దిశ, వెబ్ డెస్క్: చేనేత సహకార సంఘాలకు సంక్రాంతి ముంగిట ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఆప్కో బకాయిల్లో రూ.5 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది. గత విడత బకాయిలు సైతం విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. డిసెంబర్‌లో చేనేత సహకార సంఘాలకు రూ.2.42 కోట్ల మేర బకాయిలు చెల్లించిన విషయం తెలిసిందే. అయితే ఈ సంక్రాంతి పండగ దృష్ట్యా మరో రూ.5 కోట్లు చెల్లించాలని ఆప్కో యాజమాన్యాన్ని మంత్రి సవిత ఆదేశించారు. చేనేత సహకార సంఘాల ఆర్థిక బలోపేతానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని మంత్రి సవిత తెలిపారు. చేనేత సహకార సంఘాలకు మరికొన్ని పథకాలు వర్తింపజేస్తున్నామన్నారు. నేతన్నలు గౌరవప్రదమైన జీవనం సాగించడంతో 365 రోజులూ వారికి ఉపాధి కల్పించాలన్నది సీఎం చంద్రబాబునాయుడి లక్ష్యమన్నారు. నేతన్నలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. చేనేత ఉత్పత్తుల విక్రయాల పెంపుదలకు కో ఆప్టెక్స్, టాటా తనేరియా, ఆద్యం బిర్లా గ్రూప్ తో ఒప్పందాలు చేసుకున్నామన్నారు. ముఖ్యంగా ఈ కామర్స్ లో దిగ్గజ సంస్థలైన ఫ్లిప్ కార్ట్, అమెజాన్, జియో మార్ట్, ఓఎన్డీసీ ద్వారా ఆన్ లైన్ లో చేనేత దుస్తుల అమ్మకాలను ప్రారంభించామని మంత్రి సవిత తెలిపారు






