సిక్కిం వరదల్లో విజయనగరం తహశీల్దార్ కుటుంబం.. డీజీపీకి ఫోన్ చేసిన రామ్మోహన్ నాయుడు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-01 12:56:20  IST  )

సిక్కిం వరదల్లో విజయనగరం తహశీల్దార్ కుటుంబం చిక్కుకుపోయింది..

సిక్కిం వరదల్లో విజయనగరం తహశీల్దార్ కుటుంబం.. డీజీపీకి ఫోన్ చేసిన రామ్మోహన్ నాయుడు
X

దిశ, వెబ్ డెస్క్: సిక్కిం(Sikkim)లో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. 48 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వాన పడింది. దీంతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలు ప్రాంతాలు వరద నీటితో చిక్కుకుపోయాయి. అయితే ఈ వరదల్లో విజయనగరం తహశీల్దార్ కూర్మనాధ్ కుటుంబం(Vizianagaram Tahsildar Kurmanadh Family) చిక్కుకుంది. వేసవి సెలవులు కావడంతో కుటుంబంతో కలిసి ఐదు రోజుల క్రితం గ్యాంగ్ టక్‌కు వెళ్లారు. అక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్యాటక ప్రాంతానికి వెళ్లారు.

అయితే గత రెండు రోజులుగా అతిభారీ వర్షం కురవడంతో పర్యాటక ప్రాంతంలో వరదలు కొనసాగుతున్నాయి. దీంతో బస చేసిన హోటల్‌లోనే తహశీల్దార్ కుటుంబం ఉండిపోయారు. గ్యాంగ్ టక్‌కు వెళ్లాల్సిన ప్రాంతంలోనూ భారీగా వరద నీరు పారుతోంది. విషయం తెలుసుకున్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.. సిక్కిం డీజీపీ, అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. తహశీల్దార్ కుటుంబాన్ని క్షేమంగా పంపాలని కోరారు. ఈ మేరకు తహశీల్దార్ కుటుంబాన్ని గ్యాంగ్ టక్ తరలించేందుకు చర్యలు చేపట్టినట్లు డీజీపీ తెలిపారు. ఏపీ భవన్ స్పెషల్ కమిషన్ శ్రీకాంత్ సైతం సిక్కిం అధికారులతో మాట్లాడారు. తహశీల్దార్ కుటుంబాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారని విజ్ఞప్తి చేశారు.

Next Story