మాకు జనసేన సపోర్ట్ అవసరంలేదు: బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

మాకు జనసేన సపోర్ట్ అవసరంలేదని తెలంగాణ బీజేపీ ఎంపీ తెలిపారు...

మాకు జనసేన సపోర్ట్ అవసరంలేదు: బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ(Telangana)లో మున్సిపల్ ఎన్నికలు(Muncipal Election) పోలింగ్ జరుగుతోంది. జనసేన(Janasena) అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఎన్నికల ప్రచారంలో బీజేపీ(Bjp)కి జనసేన మద్దతిస్తుందనే ప్రచారం జరిగింది. అయితే అలా జరగలేదు. బీజేపీ అభ్యర్థులు ఒంటరిగానే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్(BJP MP Dharmapuri Arvind) సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘తెలంగాణలో ఎవరి సపోర్ట్ మాకు అవసరం లేదు. ఏపీలో కూటమిలో బీజేపీ, జనసేన ఉంది. రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేశాం. కోరుట్ల ప్రజల సపోర్ట్ ఉంది. అవుట్ రేట్‌తో ఫుల్ మెజార్టీతో బీజేపీ మున్సిపల్ పీఠం గెలుస్తాం’’ అని ఎంపీ అర్వింద్ ప్రశ్నించారు.

Next Story