ఫోర్బ్స్ జాబితాలో తెలుగు యువకుడు

by Disha Web |
ఫోర్బ్స్ జాబితాలో తెలుగు యువకుడు
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోర్బ్స్ జాబితాలో తెలుగు యువకుడు చోటు సంపాదించి ఔరా అనిపించాడు. కోనసీమ జిల్లా ద్రాక్షారామకు చెందిన కాకిలేటి సూరిబాబు కుమారుడు శివతేజ ఈ ఘటన సాధించాడు. ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన టాప్ 30 యువ సాధకుల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఐఐటీ గవాహటిలో ఈసీఈ మేజర్ డిగ్రీగా, సీఎస్ఈ మైనర్ డిగ్రీగా ఏకకాలంలో పూర్తి చేశాడు. ప్రస్తుతం బెంగళూరులో నిరామయ్ అనే వైద్య సంబంధిత సాఫ్ట్ వేర్ కంపెనీని కొంత మంది భాగస్వామ్యంతో ప్రారంభించి రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించే ప్రాజెక్టుపై పరిశోధనలు చేస్తున్నాడు.

ఇందులో శివతేజ మెషీన్ లెర్నింగ్ టీమ్ కు నాయకత్వం వహిస్తున్నాడు. ఇక్కడ పరిశోధనలు చేస్తూనే నెదర్లాండ్స్ లోని మాస్ట్రక్ట్ యూనివర్సిటీలో క్లినిలక్ డేటా సైన్స్ లో పీహెచ్ డీ పూర్తి చేశాడు. మెడికల్ ఇమేజింగ్ లో ఏడేళ్ల పై బడి అనుభవం ఉన్న శివతేజ ఇప్పటి వరకు 25కు పైగా అంతర్జాతీయ ప్రచురణలు, రెండు పుస్తక అధ్యాయాలకు సహరచన చేశాడు.Next Story