బాపట్ల నియోజకవర్గంలో అట్టహాసంగా ప్రారంభమైన చైతన్య రథయాత్ర

by Dishafeatures2 |
బాపట్ల నియోజకవర్గంలో అట్టహాసంగా ప్రారంభమైన చైతన్య రథయాత్ర
X

దిశ, చీరాల /పర్చూరు : వైసీపీ ప్రభుత్వ వైఖరితో విసిగి, వేసారి పోయిన రాష్ట్ర ప్రజలకు భవిష్యత్ పై భరోసా కల్పిస్తూ, ఇటీవల తెలుగుదేశం పార్టీ మహానాడులో ప్రకటించిన, భవిష్యత్ కు గ్యారెంటీ మినీ మ్యానిఫెస్టోను, ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చైతన్య రథయాత్ర బస్ యాత్ర బాపట్ల నియోజకవర్గంలో అట్టహాసంగా ప్రారంభించారు. ముందుగా పార్టీ కార్యాల యానికి చేరుకున్న, తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీ లు, సీనియర్ నాయకులు, భవిష్యత్తు కు గ్యారెంటీ బస్ లో, బాపట్ల పట్టణములోని శ్రీ భావన్నారాయణ స్వామి దేవాలయం నందు, ప్రత్యేక పూజలు నిర్వహించి, చైతన్య రథంయాత్రను ప్రారంభించారు. అనంతరం జమ్ములపాలెం ఫ్లై ఓవర్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి, పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

తదనంతరం బాపట్ల నియోజక వర్గ పార్టీ కార్యాలయంలో, నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో, భవిష్యత్తు కు గ్యారెంటీ మినీ మ్యానిఫెస్టో మీద, చర్చా కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, అమలు చేయబోయే ప్రజా సంక్షేమ పథకాలను, విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి, వారిని పార్టీకి మరింత చేరువ చేసే విధంగా, ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా బాధ్యత తీసుకోవాలని, తెలుగుదేశం శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.

కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబు, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఏలూరి సాంబశివరావు, ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, మాజీ ఎంపీ లు శ్రీరామ్ మాల్యాద్రి, కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ, మాజీ ఎమ్మెల్యే లు జీ.వి. ఆంజనేయు లు, ఇన్ ఛార్జ్ లు వేగేశన నరేంద్ర వర్మ, యం.యం కొండయ్య, జూలకంటి బ్రహ్మానంద రెడ్డి, శ్రావణ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి సలగల రాజశేఖర్, జే పీ గౌడ్, రాష్ట్ర స్థాయి సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Next Story