పులికాట్ దశ తిరగనుంది.. ఫ్లెమింగో శాశ్వత నివాసంగా మారనుంది!!

by Thanuru Gopichand |

తిరుపతి జిల్లాలోని పులికాట్ (Pulicat) సరస్సు ఉప్పునీటికే కాదు.. వేల కిలో మీటర్ల ప్రయాణించి వచ్చే సైబీరియన్ పక్షులకు కూడా ఫేమస్.

పులికాట్ దశ తిరగనుంది.. ఫ్లెమింగో శాశ్వత నివాసంగా మారనుంది!!
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుపతి జిల్లాలోని పులికాట్ (Pulicat) సరస్సు ఉప్పునీటికే కాదు.. వేల కిలో మీటర్ల ప్రయాణించి వచ్చే సైబీరియన్ పక్షులకు కూడా ఫేమస్. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా పులికాట్ సరస్సుకు శీతాకాలం అతిథుల రాక మొదలైంది. దీంతో ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకల సందడి ఊపందుకుంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల మంది పక్షి ప్రేమికులు హాజరవుతున్నారు.

దీనిపై రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పందిస్తూ అక్టోబరులో వచ్చి మార్చిలో వెళ్లిపోయే ఈ విదేశీ అతిథులు ఏడాది పొడగునా కనువిందు చేస్తున్నాయన్నారు. పులికాట్ ను ఫ్లెమింగోల శాశ్వత నివాస స్థావరంగా మార్చేందుకు అనుకూలమైన పరిస్థితులు కల్పించేలా కృషి చేస్తున్నామని తెలియజేశారు. భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజానికి గమ్యస్థానంగా తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అన్నారు.

ఎకో టూరిజాన్ని (Eco Tourism) అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా ఫ్లెమింగోలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా అటవీ శాఖ ఆధ్వర్యంలో అనుకూల పరిస్థితులు కల్పిస్తున్నామని చెప్పారు. ఫ్లెమింగోల ఆహారం, విశ్రాంతి, భద్రతకు ఇబ్బందులు కలగకుండా గత కొంత కాలంగా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని వివరించారు. ఈసారి మూడు రోజుల పండుగతో సరిపెట్టకుండా ఎకో టూరిజాన్ని విస్తరించే ప్రక్రియలో భాగంగా ఫోటోగ్రఫీ, బర్డ్ సీయింగ్, ఎకో క్లబ్ పేరిట వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు.

Next Story