Nellore: కోతల వాతలు పెట్టొద్దు.... ఇకపై జగన్ ప్రభుత్వం మాకొద్దు!

by Disha Web Desk 16 |
Nellore: కోతల వాతలు పెట్టొద్దు.... ఇకపై జగన్ ప్రభుత్వం మాకొద్దు!
X

దిశ, నెల్లూరు: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు ఏళ్లలో ఎనిమిది సార్లు కరెంటు చార్జీలు పెంచిందని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ అన్నారు. అప్రకటిత కరెంట్ కోతలను వెంటనే ఆపాలని జనసైనికులతో కలిసి విద్యుత్ ఎస్సీకి వినతిపత్రం అందజేశారు. ‘కోతల వాతలు పెట్టొద్దు.... ఇకపై జగన్ ప్రభుత్వం మాకొద్దు’ అని ప్రజలు అనుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం కరెంటు చార్జీలు పెంచుకుంటూ, సంక్షేమ పథకాల అర్హులను తగ్గించుకుంటూ పోతుందని ఆరోపించారు.

నిరంతరం పేద ప్రజలను ఉద్దరిస్తానని చెప్పుకునే జగన్ ప్రభుత్వం సామాన్యులకి కరెంటు చార్జీల భారం పెంచుతూ పోతుందని గునుకుల కిషోర్ విమర్శించారు. అనధికారికంగా తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో కరెంట్ తీస్తుందని మండిపడ్డారు. ఇన్వెర్టర్లను జనరేటర్లు మర్చిపోయిన ప్రజానీకం మరలా వాటి ఏర్పాటు చేసే పనిలో పడ్డారన్నారు. సామాన్య కుటుంబానికి కూడా వెయ్యి రూపాయలు లోపు కరెంట్ బిల్లు వచ్చే పరిస్థితి లేకుండా ప్రభుత్వం చేస్తుందన్నారు. దీనిని సాకుగా చూపి సంక్షేమ పథకాలు ఏరువేత పనులో పడిందన్నారు. ఈ వైసిపి ప్రభుత్వం కరెంటు కోతలను కట్టడి చేసి చార్జర్ల పెంపును నియంత్రణ చేయకపోతే జనసేన పార్టీ తరఫున నిరసనలు ఉధృతం చేసి ప్రజల పక్షాన పోరాడుతామని కిషోర్ హెచ్చరించారు.



Next Story