షాకింగ్ ఘటన.. చికెన్‌లో బయటపడ్డ పురుగులు

by Jakkula.Mamatha |   (  Updated:2025-03-23 13:11:38  IST  )

నాన్‌వెజ్(Non-veg) ప్రియుల్లో కొంతమంది మటన్, ఫిష్, మరి కొంతమంది చికెన్‌ను ఇష్టపడతారు

షాకింగ్ ఘటన.. చికెన్‌లో బయటపడ్డ పురుగులు
X

దిశ,వెబ్‌డెస్క్: నాన్‌వెజ్(Non-veg) ప్రియుల్లో కొంతమంది మటన్, ఫిష్, మరి కొంతమంది చికెన్‌ను ఇష్టపడతారు. ఇక ఎక్కువగా చికెన్‌(Chicken) తినేవాళ్లు ఉంటారు అనండంలో ఆశ్చర్యం లేదు. ఈ క్రమంలో ఆదివారం వచ్చిందంటే చాలా ఇంట్లో కచ్చితంగా చికెన్‌ ఉండాల్సిందే. చికెన్‌తో వెరైటీ వంటకాలను రుచికరంగా చేసుకొని ఎంజాయ్ చేస్తూ తింటారు. అయితే ఇటీవల చికెన్​ బిర్యానీలో కప్ప, పురుగులు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం.

తాజాగా ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో ఇలాంటి ఘటనే బయటపడింది. వివరాల్లోకి వెళితే.. కాకినాడ జిల్లా(Kakinada Disrict) సామర్లకోటలో చికెన్‌లో పురుగులు కనిపించడం కలకలం రేపింది. ఓ వ్యక్తి సండే కదా అని చికెన్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాడు. ఈ తరుణంలో వండేందుకు సిద్ధమవుతుండగా అందులో పురుగులు కదులుతూ కనిపించాయి. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ క్రమంలో అతను వెంటనే చికెన్‌ను షాపుకు తీసుకెళ్లి ప్రశ్నించారు. అయితే దుకాణం యజమాని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. దీంతో అధికారులు మాంసం షాపుల్లో తనిఖీలు నిర్వహించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Next Story