భారతంలో అభిమన్యుడిలా పోరాడుతున్నాం..ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్

by Disha Web Desk 3 |
భారతంలో అభిమన్యుడిలా పోరాడుతున్నాం..ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
X

దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ రోజు కర్నూలుకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు ఘణ స్వాగతం పలికేందుకు కర్నూలు లోని కాంగ్రెస్ నేతలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెన్ మస్తాన్ వలి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పది సంవత్సరాల తరువాత మళ్ళీ కర్నూలులో కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతోందని హర్షం వ్యక్తం చేశారు.

రాజన్న స్థానంలో అయన కూతురు పార్టీ బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. వైఎస్ షర్మిల దృఢ నాయకత్వంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం సంతరించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. దశాబ్ద కాలం నుండి కర్నూలులో ఒక ఎమ్మెల్యే ఎంపీ లేకపోయిన వారు భారతంలో అభిమన్యుడిలా వీరోచితంగా పోరాడుతున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం షర్మిల రాక అటు కాగ్రెస్ నేతల్లోనూ ఇటు కర్నూలు, నంద్యాల ప్రజల్లోనూ కొత్త ఉత్సహాన్ని నింపిందని పేర్కొన్నారు. షర్మిల రాక కోసం నంద్యాల, కర్నూలు ప్రజలు ఉత్సహంగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఇక ఆమె రాగానే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి, దురాక్రమణల గురించి షర్మిలమ్మకు విన్నవించేందుకు కర్నాలు, నంద్యాల ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు.

ఇక చాల కాలం తరువాత మళ్ళీ వైసెస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వం లాంటి దృఢ నాయకత్వం వైస్ షర్మిల రూపంలో దొరికిందని పేర్కొన్నారు. ఆమె నాయకత్వంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వస్తుందని.. రాజశేఖర్ రెడీ ఆశయాల సాధనకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని నాధ్యాల, కర్నూలు ఇరు జిల్లాల్లోని కాంగ్రెస్ పార్టీ నేతలు విస్వసిస్తున్నారని తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అలుపన్నది లేక నిర్విరామంగా కృషిచేస్తుంది వెల్లడించారు.



Next Story

Most Viewed