‘చెట్టు తొర్రలో దాక్కున్నా లోకేష్‌ను అరెస్ట్ చేసి తీరుతాం’

by Disha Web Desk 2 |
‘చెట్టు తొర్రలో దాక్కున్నా లోకేష్‌ను అరెస్ట్ చేసి తీరుతాం’
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాని మీడియాతో మాట్లాడుతూ.. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ పాత్రపై ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. చెట్టు తొర్రలో దాక్కున్నా లోకేష్‌ను అరెస్ట్ చేసి తీరుతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కంటే లోకేష్ గొప్పవాడేం కాదని అన్నారు. లోకేశ్ హెరిటేజ్ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్న సమయంలోనే అమరావతిలో భూములు కొనాలని నిర్ణయించారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.

చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో రాజధాని అంశంపై రోజుకో డ్రామా నడిపారన్నారు. టీడీపీ హయాంలోని అవినీతి కథల్లో ఇది కూడా ఒకటి అన్నారు. దోపిడీ దొంగలు రెక్కీ వేసినట్లుగా రింగ్ రోడ్డు కుంభకోణం జరిగిందని, కానీ, ఇది కేబినెట్ నిర్ణయమంటూ చంద్రబాబు చెప్పారన్నారు. రాజధాని మాస్టర్ ప్లాన్ పేరుతో స్కాం చేశారన్నారు. లింగమనేని రమేశ్ పొలం మధ్య నుంచి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చేలా ప్లాన్ మార్చారని ఆరోపించారు.

Next Story