- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Heavy Rain: ఈదురుగాలులతో కూడిన వర్షం.. తప్పిన పెను ప్రమాదం
ఏపీలో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి..

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో పలు చోట్ల వర్షాలు(Rain) పడుతున్నాయి. రెండు రోజులుగా తీవ్ర ఎండతో అల్లాడిపోయిన ప్రజలకు శుక్రవారం భారీ వర్షం బిగ్ షాక్ ఇచ్చింది. పలు చోట్ల వాన దంచి కొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు చేరాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, వృక్షాలు నేలకొరిగాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్డుపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనరాకపోకలకు అంతరాయం కలిగింది. ఉమ్మడి కర్నూలు(Kurnool), కడప(Kadapa), విశాఖ (Vishaka), శ్రీకాకుళం జిల్లా(Srikakula District)ల్లో ఈదురుగాలులతో వర్షం బీభత్సం సృష్టించింది. ఈ ఉదయం అధిక ఉష్ణోగ్రతతో ఎండ మాడు పగలగొట్టింది. మధ్యాహానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో వాన విరుచుకుపడింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Seetharamaraju District)లో అయితే ఈదురుగాలుల వర్షం బీభత్సం సృష్టించింది. దెబ్బతో చెట్లు, కరెంట్ స్తంభాలు కూలిపోయాయి. పాడేరులో భారీ వృక్షం కూలిపోయింది. చెట్టు కింద ఎవరూ లేకపోవడం పెను ప్రమాదం తప్పింది. కానీ బైక్ మాత్రం పూర్తిగా ధ్వంసమైంది. దీంతో స్థానికుల భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో ఎవరైనా ఉంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేదని ఆందోళన చెందుతున్నారు.






