- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vijayawada: దుర్గమ్మకు కాసుల వర్షం.. మూడు వారాల్లో కళ్లు చెదిరే ఆదాయం!
విజయవాడ(Vijayawada) ఇంద్రకీలాద్రిపై కొలవైన దుర్గమ్మను నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.

దిశ,వెబ్‌డెస్క్: విజయవాడ(Vijayawada) ఇంద్రకీలాద్రిపై కొలవైన దుర్గమ్మను నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. ఈ క్రమంలో కొన్ని సార్లు భక్తుల రద్దీ సాధారణంగా, కొన్ని సార్లు అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మూడు వారాలకు గానూ సమకూరిన హుండీల ఆదాయాన్ని ఆలయ అధికారులు లెక్కించారు. ఈ క్రమంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం హుండీలకు భారీగా ఆదాయం వచ్చిందని తెలిపారు. దుర్గమ్మ ఆలయంలోని మల్లికార్జున మహా మండపం 6వ అంతస్తులో హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలు లెక్కించారు.
నగదు(Cash) రూపంలో ఆదాయం రూ.3,22,45,920 వచ్చినట్లు ఆలయ ఈవో రామచంద్ర మోహన్ తెలిపారు. నగదుతో పాటు 618 గ్రాముల బంగారం, 6.280 కిలోల వెండి వస్తువులను భక్తులు కానుకల రూపంలో హుండీలో సమర్పించారు. డబ్బులతో పాటుగా విదేశీ కరెన్సీ(Foreign currency) కూడా ఉంది. USA డాలర్లు 773, ఓమన్ బైసాలు 400, కెనడా డాలర్లు 205, ఇంగ్లాండ్ పౌండ్లు 15, సింగపూర్ డాలర్లు 14, న్యూజిలాండ్ డాలర్లు 10 ఉన్నాయి. అలాగే దుర్గమ్మకు ఈ-హుండీ ద్వారా రూ.1,13,085 ఆదాయం వచ్చింది. హుండీల లెక్కింపును దేవస్థానం అధికారులు, పోలీసులు పర్యవేక్షించారు.






