- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రకాశం బ్యారేజి ధ్వంసం ఘటన.. నిందితులకు 14 రోజుల రిమాండ్
by Muthe.Rajitha |
ప్రకాశం బ్యారేజిని పడవలు ఢీ కొట్టి ధ్వంసం చేసిన ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : ప్రకాశం బ్యారేజిని పడవలు ఢీ కొట్టి ధ్వంసం చేసిన ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇద్దరు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది. పడవల యజమానితో పాటు, మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం న్యాయస్థానంలో ప్రవేశ పెట్టారు. ఈ నెల 1న ప్రకాశం బ్యారేజిని మూడు బోట్లు ఢీకొట్టగా 67,68,69 గేట్ల కౌంటర్ వెయిట్లు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించగా.. బోట్లకు సంబంధించిన ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. కాగా ఈ ఘటనలో ఏదైనా కుట్ర కోణం ఉందా అనే దిశగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Next Story






