AP Deputy CM:‘ఆ విషయం పై తెలంగాణ దృష్టి పెట్టాలి’.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా కీలక ప్రకటన చేశారు.

AP Deputy CM:‘ఆ విషయం పై తెలంగాణ దృష్టి పెట్టాలి’.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా కీలక ప్రకటన చేశారు. మయన్మార్‌లో అంతర్యుద్దం కారణంగా భారత్ లోకి ప్రవేశించి వేర్వేరు నగరాల్లో రోహింగ్యాలు తలదాచుకుంటున్నారు అని పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తెలిపారు. వారి వల్ల స్థానికుల ఉపాధి దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని రోహింగ్యాల విషయంలో తెలంగాణ ప్రభుత్వమే(Telanagana Government) చర్యలు తీసుకోవాలని ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) ప్రధానంగా ఈ విషయం పై దృష్టి పెట్టాలి అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

ఇదిలా ఉంటే.. ఇటీవల జమ్మూ కాశ్మీర్(Jammu Kashmir) లోని పహల్గాం లో ఉగ్రదాడికి 26 మంది అమాయకులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రవాదుల దాడిలో ఏపీ వాసులు కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్(Operation sindoor) పై బుధవారం హైదరాబాద్(Hyderabad) లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పహల్గాం(Pahalgham) దుర్ఘటనలో ఏపీకి చెందిన ఇద్దరు చనిపోయారని తెలిపారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు భారత్ గట్టి సమాధానం చెప్పిందన్నారు. ఇది గర్వించదగ్గ విషయం ఈ సమయంలో పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వానికి అంతా మద్దతుగా నిలవాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

Next Story