అలా ఉండండి.. జనసైనికులకు పవన్ కల్యాణ్ కీలక సందేశం

by Vemula.Srinu Prasad |

అలా ఉండండి.. జనసైనికులకు పవన్ కల్యాణ్ కీలక సందేశం
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో కూటమిలో విభేదాలు సృష్టించేందుకు సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. సీఎంగా పవన్ కల్యాణ్(Pawan Kalyan), డిప్యూటీ సీఎంగా నారా లోకేశ్(Nara Lokesh) అంటూ ప్రచారం జోరుగా సాగింది. దీంతో టీడీపీ(Tdp), జనసేన(Janasean) నాయకుల మధ్య విభేదాలు తలెత్తాయే స్థాయికి వెళ్లింది. ఈ మేరకు అప్రమత్తమైన రెండు పార్టీ పెద్ద నాయకులు.. కూటమి కార్యకర్తలు సంయమనం పాటించాలని పిలుపు నిచ్చారు. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, వారి మాయలో పడొద్దని పిలుపునిచ్చారు. దీంతో ఈ వివాదం సర్దుమనిగింది.

అయితే గణతంత్య్ర దినోత్సవం(Re Public Day) సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. జనసైనికులకు, వీరహహిళలకు, నాయకులకు కీలక సందేశం ఇచ్చారు. ఎన్డీయే శ్రేణులు బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు. కూటమి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు.అనవసరమైన వివాదాలు, విభేదాల జోలికి వెళ్లొద్దని పిలుపునిచ్చారు. తప్పుడు ప్రచారాలపై, కూటమి అంతర్గత విషయాలపై ఎవరూ స్పందించొద్దన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలు బహిరంగంగా చెప్పొద్దని సూచించారు. పదవుల కోసం తాను రాజకీయాలు చేయలేదని, భ్యవిష్యత్తులోనూ చేయనని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Next Story