- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
10వ స్థానంలో పవన్ కల్యాణ్.. కీలక లిస్టు విడుదల

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతోంది. దీంతో పాలన తీరుపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా మంత్రుల పని తీరుపై సర్వే చేయించారు. మెరుగైన పని తీరు కనబర్చిన 25 మందిని సర్వేలో ప్రజలు సెలక్ట్ చేశారు. ప్రజల అభిప్రాయం మేరకు వారికి ర్యాంకులు కేటాయించారు. చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ సహా అందరి ర్యాంకులను తాజాగా ప్రకటించారు. సీఎం చంద్రబాబుది ఆరో స్థానం కాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు 10వ స్థానం లభించింది. అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రి లోకేశ్ పని తీరును ప్రక్కన పెడితే పవన్ కల్యాణ్‌కు 10వ స్థానం రావడం మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
జనసేన స్థాపించిన తర్వాత పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఆ పార్టీ నాయకులు గెలుపొందారు. దీంతో వారిలో కొంతమందికి మంత్రులుగా అవకాశం దక్కింది. అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కూడా డిప్యూటీ సీఎం పదవి లభించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ నిరంతరం ప్రజా సేవ చేస్తున్నారు. రాజకీయ నాయకుడిగా పవన్ వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఆయన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నారు. మరోవైపు మంగళగిరి జనసేన కార్యాలయంలో ప్రజలకు ఆ పార్టీ నాయకులు అందుబాటులో ఉంటున్నారు. ప్రతి నెల పింఛన్ పంపిణీ కార్యక్రమంలోనూ పాల్గొంటున్నారు. లబ్ధిదారులకు నగదు అందజేస్తున్నారు. గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిన వారికి కూడా ఆయా శాఖల అధికారులకు డైరెక్ట్‌గా ఫోన్ చేసి సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఇలా పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు.
అయితే చంద్రబాబు చేయించిన సర్వేలో పవన్ కల్యాణ్‌కు పదో స్థానం దక్కడం జనసేన నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. తమ అధినేత ప్రతి నిత్యం ప్రజా సేవలో ఉంటున్నా.. పని తీరులో మాత్రం ఎందుకు వెనుక బడ్డారనే అంశాలపై అరా తీస్తున్నారట. రాజకీయ నాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నా.. సినీ హీరోగా భారీ క్రేజ్ ఉన్నా పవన్ కల్యాణ్‌కు 10వ ర్యాంకు రావడం తమను నిరుత్సాహానికి గురి చేసిందని అంటున్నారట. ఈ ఏడు నెలల కన్నా రానున్న రోజుల్లో మరింతగా ప్రజా సేవ చేసి మరోసారి విడుదల అయ్యే ర్యాంకిగ్స్‌లో నెంబర్ వన్ స్థానాన్ని పవన్ దక్కించుకుంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారట. మెరుగైన సేవ అందించి పవన్ ఈసారి ఏ స్థానం సంపాదించుకుంటారో చూడాలి.