- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జడ్పీటీసీ లైంగిక వేధింపులు : అవుట్ సోర్స్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
జడ్పీటీసీ లైంగిక వేధింపులు భరించలేక ఓ అవుట్ సోర్స్ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

- జడ్పీటీసీ నర్రా సుబ్బయ్యపై తీవ్ర ఆరోపణలు
- బాధిత అవుట్ సోర్స్ ఉద్యోగిని వీడియో సోషల్ మీడియాలో వైరల్
దిశ ప్రతినిధి, బాపట్ల: అధికార పార్టీకి చెందిన జడ్పీటీసీ నర్రా సుబ్బయ్య నాపై అగాయిత్యం చేయబోయాడనీ, నన్ను చాలా సార్లు గెస్ట్ హౌస్ కి రమ్మని ఒత్తిడి చేశాడని, చెప్పిన మాట వినకపోతే నీ పని అంతే అంటూ బెదిరించాడనీ నిజాంపట్నంకు చెందిన అవుట్ సోర్స్ ఉద్యోగి శివకుమారి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆత్మహత్యాయత్నం అనంతరం వైద్యశాలలో చికిత్స పొందుతూ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జడ్పీటీసీ పదవి అడ్డుపెట్టుకొని చాలా మంది స్త్రీల జీవితాలతో ఆడుకున్నాడనీ, నర్రా సుబ్బయ్య అతని బావమరిది వల్ల ప్రాణ హాని వుందనీ ఆమె తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు.ఇల్లాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండటం సిగ్గు చేటనీ, స్త్రీలను గౌరవించలేని వాళ్ళు సమాజానికేమి సేవ చేస్తారనీ ఆమె ప్రశ్నిస్తున్నారు.ప్రభుత్వం వెంటనే జడ్పీటీసీ నర్రా సుబ్బయ్య పైన క్రిమినల్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. నాకు, నా పిల్లలకు ఏదయినా జరిగితే అది జడ్పీటీసీ నర్రా సుబ్బయ్యనే కారణమని పేర్కొన్నారు. నన్ను మానసికంగా చాలా మార్లు లైంగికంగా వేధింపులకు గురిచేసిన సుబ్బయ్యనీ వదలొద్దనీ ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జడ్పీటీసీ నర్రా సుబ్బయ్యను రాజకీయాల నుండి శాస్యతంగా తొలగించాలనీ అప్పుడే స్త్రీలు దైర్యంగా ఉద్యోగాలు చేయగలరనీ, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు ఈ విషయంపై బాధితుల తరఫున పోరాడాలని శివకుమారి కోరారు.






