Modi: మోదీకి మన:పూర్వక స్వాగతం.. చంద్రబాబు నాయుడు, పవన్

by Thanuru Gopichand |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ప్రధాని మోదీకి మనఃపూర్వకంగా స్వాగతం పలుకుతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్​​చేశారు

Modi: మోదీకి మన:పూర్వక స్వాగతం.. చంద్రబాబు నాయుడు, పవన్
X

దిశ, డైనమిక్ ​బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ప్రధాని మోదీకి మనఃపూర్వకంగా స్వాగతం పలుకుతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు (Chandrabbu) ట్వీట్​ ​చేశారు రాష్ట్ర ప్రజల కలల రాజధాని నిర్మాణాన్ని సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. రాష్ట్రంలో ప్రతి పౌరునికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించే ప్రజా రాజధానిగా అమరావతి ఆవిష్కృతం అవుతుందని తెలిపారు. సంపద సృష్టితో రాష్ట్రానికి ఒక చోదక శక్తిగా నిలబడుతుందని, ఇందుకు సహకరిస్తున్న నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రజల తరపున మరొక్క మారు కృతజ్ఞతాపూర్వక స్వాగతం పలుకుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ పనులను పునః ప్రారంభించేందుకు ఈరోజు రాష్ట్రానికి విచ్చేస్తున్న ప్రధాని మోదీకి హృదయపూర్వక స్వాగతం... సుస్వాగతం అని ఉపముఖ్యమంత్రి పవన్​కల్యాణ్ (Pawan kalyan)​పేర్కొన్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు ప్రతిరూపంగా రూపుదిద్దుకుంటున్న ప్రజా రాజధాని అమరావతి పున్నిర్మాణాన్ని మీ అమృత హస్తాలతో ప్రారంభిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని తెలిపారు.

Next Story