- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Onion Rates: మళ్లీ ఉల్లి ధరలకు రెక్కలు.. కిలో ఎంతంటే..!
ఉల్లి ధరలు పరుగులు పెడుతున్నాయి. ..

దిశ, వెబ్ డెస్క్: ఉల్లి ధరలు(Onion Rates) పరుగులు పెడుతున్నాయి. కొంతకాలంగా క్రమ క్రమంగా పెరుగుతు వచ్చిన ధరలు ఇప్పుడు భారీగా పెరిగాయి. నిత్యావసరాల్లో ఉల్లి కూడా ప్రాధాన అవసరమే. దీంతో ఉల్లి ధరలు ప్రతి నిత్యం మారుతుంటాయి. ఇతర రాష్ట్రాల్లోనే కాదు, కొంత తెలుగు రాష్ట్రాల్లోనూ కొద్ది రోజులుగా ఉల్లి ధరలకు రెక్కలొస్తున్నాయి. సాధారణంగా వంటల్లో చిన్నరకం ఉల్లినే ఉపయోగిస్తారు. అయితే ఈ రకం పంట దిగుబడి అమాంతం పడిపోయింది. అక్టోబర్ నెలలో మార్కెట్లలో గుట్టలు గుట్టలు కనిపించిన చిన్న రకం ఉల్లిపాయలు ఇప్పుడు భారీగా తగ్గిపోయాయి. దీంతో ఈ మధ్య కాలంలో ఉల్లి రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. మూడు నెలలకు ముందు రూ. 20 ఉన్న ధర ఇప్పుడు పలుచోట్ల కిలో రూ. 50 వరకూ అమ్ముతున్నారు. మున్ముందు రోజుల్లో ఈ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు.
ఇక కర్ణాటకలో అయితే ఇప్పటికే కిలో రూ. 100కు అమ్ముతున్నారు. అలాగే ఏపీ, తెలంగాణ(Ap,Telangana) సరిహద్దు కర్ణాటక(Karnataka) పరిధిలోనూ రూ. 100కు విక్రయిస్తున్నారు. దిగుబడి తగ్గడంతో అటు విదేశాలకు కూడా ఎగుమతి తగ్గించింది. ఈ ప్రభావంతో ఉల్లి ధరలు కొనకుండానే కళ్లు మండిపోతున్న పరిస్థితికి చేరుకుంటున్నాయి. దీంతో వినియోగదారులు లబో దిబో మంటున్నారు. ఉల్లి ధరలపై ప్రభుత్వాలు ముందుగానే దృష్టి పెట్టాలని అంటున్నారు. ఉల్లి కొరత కారణాలు తెలుసుకుని ప్రజలపై భారం పడకుండా చూడాలని కోరుతున్నారు.






