రాజకీయ ప్రవేశంపై ఏ నిర్ణయం తీసుకోలేదు.. వంగవీటి ఆశాలత కీలక ప్రకటన

by Kema Shiva Kumar |

ప్రస్తుతానికి తన దృష్టి అంతా 'రాధా-రంగా మిత్ర మండలి'ని స్వచ్ఛంద సంస్థగా బలోపేతం చేయడంపైనే ఉందని వంగవీటి ఆశాలత స్పష్టం చేశారు.

రాజకీయ ప్రవేశంపై ఏ నిర్ణయం తీసుకోలేదు.. వంగవీటి ఆశాలత కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: రాజకీయాల్లోకి రావాలా.. వద్దా అన్న విషయంపై తానిప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా (Vangaveeti Mohana Ranga) కుమార్తె ఆశాలత (Aasha Latha) తెలిపారు. ఇవాళ ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. రంగా గారి అభిమానుల కోసం తాను ‘రాధా-రంగా మిత్ర మండలి’ని నడుపుతున్నానని అన్నారు.

అయితే, తన రాజకీయ నిర్ణయానికి ఈ మిత్ర మండలికి ఎలాంటి సంబంధం లేదని ఆశాలత స్పష్టం చేశారు. మిత్ర మండలిలో అన్ని పార్టీల కార్యకర్తలు, అన్ని కులాలు, మతాల వారు ఉన్నారని పేర్కొన్నారు. తాను ప్రస్తుతం మిత్ర మండలిని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టానని, అదొక స్వచ్ఛంద సంస్థగా (Organization) స్థిరపడాల్సిన అవసరం ఎంతగానో ఉందన్నారు. తాను రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఇంకా చాలా సమయం ఉందని.. ఇప్పుడంత తొందరేం లేదని ఆశాలత స్పష్టం చేశారు.

Next Story