- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చికెన్ షాపులకు కొత్త రూల్స్.. ఇకపై లైసెన్సులు
ఏపీ చికెన్ వ్యాపారస్తులకు బిగ్ అలర్ట్. ఇకపై చికెన్ వ్యాపారం చేయాలంటే కచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలని కొత్త విధానాన్ని

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని చికెన్ వ్యాపారస్తులకు బిగ్ అలర్ట్. ఇకపై చికెన్ వ్యాపారం చేయాలంటే కచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలని కొత్త విధానాన్ని తీసుకువస్తోంది ఏపీ సర్కార్. చికెన్ వ్యాపారంలో అక్రమాలను అరికట్టేందుకు ఈ కొత్త లైసెన్సింగ్ విధానాన్ని తీసుకువస్తున్నట్లు ప్రకటన చేసింది. ప్రజలకు నాణ్యమైన చికెన్ అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రతి చికెన్ దుకాణానికి లైసెన్స్ ఇకపై తప్పనిసరి కానుంది. ఈ లైసెన్స్ ద్వారా కోళ్ల సప్లై చైన్ ను ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది.
ఏ పౌల్ట్రీ నుంచి ఎన్ని కోళ్లు వెళ్లాయి ? ఏ దుకాణ దారుడికి విక్రయించారు? రోజుకు ఎన్ని కోళ్లు వెళుతున్నాయి ? ఇలా అనేక రకాల అంశాలను ట్రాక్ చేసేలా ఈ సిస్టం తీసుకువస్తున్నారు. అంతే కాదు గుర్తింపు పొందిన చికెన్ దుకాణాల నుంచి మాత్రమే హోటల్ యజమానులు మాంసం కొనేలా ప్రోత్సహించే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. స్టెరాయిడ్లు వాడిన కోళ్ల అమ్మకాలను పూర్తిగా నియంత్రించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదే సమయంలో చికెన్ దుకాణాల వ్యర్ధాలను తీసుకువెళ్లి, చేపలకు ఆహారంగా వాడుతున్న మాఫియాను కూడా అరికట్టేలా సిస్టం తీసుకు వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఏపీ మాంసాభివృద్ధి సంస్థ.






