ఏపీలో అధికారంలోకి వచ్చేది ఆ పార్టీనే.. తేల్చి చెప్పిన నాగన్న సర్వే..!

by Disha Web Desk 12 |
ఏపీలో అధికారంలోకి వచ్చేది ఆ పార్టీనే.. తేల్చి చెప్పిన నాగన్న సర్వే..!
X

దిశ, వెబ్‌డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికలతో పాటే.. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే అధికారంలో ఉన్న వైసీపీ, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య నువ్వా నేనా అన్నట్లు రాజకీయ యుద్ధం నడుస్తోంది. ఇందులో భాగంగా ఇరు పార్టీలకు చెందిన అన్ని నియోజకవర్గాల అభ్యర్థుల ప్రకటన పూర్తి కావడంతో.. ఆయా చానల్లు, సర్వే సంస్థలు పార్టీల గెలుపోటములను అంచనా వేసే పనిలో పడ్డాయి. ఈ క్రమంలోనే తాజాగా.. నాగన్న సర్వే ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 157 నియోజకవర్గాల్లో లక్షకు పైగా ఓటర్ల నుంచి మార్చి 17 నుంచి ఏప్రిల్ 7 వరకు అభిప్రయాలను స్వీకరించింది.

నాగన్న సర్వే‌లో ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను ఆధారంగా చేసుకుని.. ఏపీలో వైసీపీ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని అంచనా వేశారు. మొత్తం 103 నియోజకవర్గాలను గెలుచుకుని వైసీపీ అధికారంలోకి వస్తుందని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కేవలం 39 స్థానాలతోనే సరిపెట్టుకుంటాయని నాగన్న సర్వేలో తెలిపింది. అలాగే మరో 33 స్థానాల్లో కూడా వైసీపీ, టీడీపీ కూటమి మధ్య నువ్వా నేనా అన్నట్లు పోరు నడుస్తుందని అంచనా వేశారు. దీంతో పాటుగా.. పార్లమెంట్ సీట్లలో కూడా 20 నుంచి 21 స్థానాలను వైసీపీ గెలుస్తుందని, 4 నుంచి 5 స్థానాల్లో మాత్రమే కూటమి అభ్యర్థులు గెలుస్తారని నాగన్న సర్వే అంచనా వేసింది.

Read More..

నేను YS బిడ్డననే విషయం మరువద్దు..YCP శ్రేణులకు షర్మిల మాస్ వార్నింగ్


Next Story

Most Viewed