Kurnool: బొలేరో బోల్తా.. ముగ్గురు మృతి

by Disha Web Desk 16 |
Kurnool: బొలేరో బోల్తా.. ముగ్గురు మృతి
X

దిశ, కర్నూలు ప్రతినిధి: అతి వేగం ముగ్గురు ప్రాణాలు తీసింది. పందుల వేట కోసం వెళ్తున్న దినసరి కూలీలు ప్రమాదంలో అక్కడిక్కడే ఇద్దరు మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ హృదయ విదారక ఘటన కోడుమూరు పట్టణ శివారులో చోటు చేసుకుంది. హోళగుంద మండలం కొత్తపేట, హెబ్బటం, ఉరుకుంద, కారవిగడ్డం తండా, నెలకినేకల్ గ్రామాలకు చెందిన 16 మంది దినసరి కూలీలు పందుల వేట కోసం తెలంగాణ రాష్ట్రానికి బొలెరో వాహనంలో బయలుదేరారు.

నిద్ర మత్తులో..!

అయితే డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడంతో పాటు వాహనాన్ని వేగంగా నడుపుతున్నారు. కోడుమూరు శివారు ప్రాంతానికి చేరుకునే సమయంలో కర్నూలు నుంచి మంత్రాలయం వైపు వేగంగా వస్తున్న మినీ లారిని తప్పించబోయిన బొలేరో అదుపు తప్పి పెట్రోలు పంపు వద్ద బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ముత్తు (35), మల్లయ్య (38)లు అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వీరేష్ (42) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే మహేష్, గాది లింగ, డ్రైవర్ అంపయ్య, బోదెప్ప, రంగయ్య, శేఖర్, రవి, ప్రసాద్, ఈరప్పలు తీవ్రంగా గాయపడి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ మద్యం తాగి వేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని క్షతగాత్రులు వాపోతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story