- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Yemmiganur: పొలం విషయంలో దాడులు.. పదిమందికి తీవ్ర గాయాలు
దిశ, ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు మండలం గుడేకల్ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బోయ నడవలయ్య, చాకలి మిద్దె బజారప్ప కుటుంబాల మధ్య పొలం విషయంలో గొడవ జరిగింది. దీంతో రెండు వర్గాలు పరస్పరం రాళ్లు, కర్రలు, కారంతో దాడులు చేసుకున్నారు. పెద్ద నల్లన్న కుటుంబానికి సర్వే నంబర్ 365లో ఏడు ఎకరాల్లో ఐదు ఎకరాల ప్రభుత్వ పొలంలో పట్టా మంజూరు అయింది.
అయితే 5 ఎకరాల పొలంలో తమకు కూడా ఎకరం వస్తుందని నడవలయ్య కుటుంబసభ్యులు కోర్టుకు వెళ్లారు. అయితే పొలం విషయం కోర్టులో ఉంది. అయినప్పటికీ రెండు వర్గాలు పొల వద్దకు వెళ్లారు. దీంతో వారి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో మాట మాట పెరిగింది. ఒక్కసారిగా కర్రలు, రాళ్లు, ఇనుప రాడ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పదిమందికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిగా తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.